సంత్ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.కోటి విరాళం

పట్టణంలో నిర్మించబోయే సంత్ సేవాలాల్ నూతన ఆలయానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రూ. కోటి విరాళం ప్రకటించారు.

Update: 2023-02-15 12:23 GMT

ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు

దిశ, అచ్చంపేట: పట్టణంలో నిర్మించబోయే సంత్ సేవాలాల్ నూతన ఆలయానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రూ. కోటి విరాళం ప్రకటించారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన గిరిజను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను పుట్టింది వనపర్తి ప్రాంతమైనా నా ప్రాణం అంతా అచ్చంపేటపై ఉంటుందని, ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించడం హర్షించదగిన విషయమన్నారు.

పట్టణంలో భారీ ర్యాలీ

జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలను గిరిజనులు తమ సాంప్రదాయ వేషాధారణలతో నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా బంజారాలు ఉన్న నేపథ్యంలో జయంతి వేడుకల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సందర్భంగా బుధవారం అచ్చంపేట పట్టణంలో ప్రధాన రహదారి పొడవున భారీ ఎత్తున గిరిజనులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజు ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంతు సేవాలాల్ ఆధ్యాత్మిక సేవా గుణం కలిగినమహానుభావుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, ఎంపీపీ శాంతాబాయి, జడ్పీటీసీ మంత్రి నాయక్, నాయకులు గోపాల్ నాయక్, లౌక్య నాయక్, తులసి రామ్ నాయక్, శ్రీరాం నాయక్, లాలూ నాయక్, గిరిజన యువకులు, విద్యార్థినీ, విద్యార్థులు, ఉద్యోగ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News