ట్రాఫిక్ లో ఇరుక్కున్న కలెక్టర్ కారు

మక్తల్ లో ప్రధాన రహదారి నుంచి తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్న కలెక్టర్ కారు ట్రాఫిక్ లో ఇరుక్కోవడంతో.. అసహనం వ్యక్తం చేశారు.

Update: 2024-11-10 12:47 GMT

దిశ,మక్తల్ : మక్తల్ లో ప్రధాన రహదారి నుంచి తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్న కలెక్టర్ కారు ట్రాఫిక్ లో ఇరుక్కోవడంతో.. అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ హోదాలో పర్యవేక్షణ సమయాల్లో.. కలెక్టర్ కారు రాకపోకలకు ఇలాంటి ఆటంకాలు లేకుండా స్థానిక పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించాల్సి ఉంటుంది. కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ లో కలెక్టర్ కారు ఇరుక్కుపోయింది. ఆదివారం రెండో రోజు కుటుంబ సర్వే ,ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలను పరిశీలించేందుకు కలేక్టర్ సిక్తాపట్నాయక్ జాతీయ రహదారి నుండి తహసిల్దార్ కార్యాలయానికి వస్తుండగా.. రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసిన వాహనాలు ఎదురెదురుగా వస్తున్న వాహనాల మధ్య కలేక్టర్ కారు రెండు నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో కలేక్టర్ గన్మెన్ కారు దిగి ట్రాఫిక్ ను సరి చేసి.. కారుకు దారి ఏర్పాటు చేశారు. ఈ విషయంపై తాసిల్దార్ ను మున్సిపల్ కమిషనర్ ను " దిశ"ప్రశ్నించగా ట్రాఫిక్ నియంత్రణ పోలీసుల బాధ్యత అని అన్నారు. పార్కింగ్ చేసిన వాహనాలపై సంబంధిత దుకాణ యజమానులను హెచ్చరిస్తామని కమిషనర్ అన్నారు.మక్తల్ లో ప్రధాన రహదారి నుంచి తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్న కలెక్టర్ కారు ట్రాఫిక్ లో ఇరుక్కోవడంతో.. అసహనం వ్యక్తం చేశారు.


Similar News