సీఎం..సొంతూరు మురిపెం

సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంతూరు నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి వెళ్లారు.

Update: 2024-10-12 14:37 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంతూరు నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. పండగ సందర్భంగా ప్రతి ఏటా తన కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి దసరా వేడుకలు జరుపుకోవడంతో..గ్రామస్తులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గ్రామంలో రేవంత్ రెడ్డి కి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో తన సొంత గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ రాజేష్ , వాకిటి శ్రీహరి ,ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ఆయా ప్రాంతాల నుండి తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు టపాసులతో..బతుకమ్మ ఆడుతూ..ఊరేగింపు గా వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి వివేకానంద రెడ్డి హలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కమ్యూనిటీ భవనం కు శంకుస్థాపన, 55 లక్షలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయం, 70 లక్షలతో అధునాతన సదుపాయాలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ, 72 లక్షల వ్యయంతో మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 64 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రయాణ ప్రాంగణం, దీపాలంకరణ పనులకు, 18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగునీటి పైపులై, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు, 32 లక్షలతో నిర్మించే చిల్డ్రన్స్ పార్క్, బహిరంగ వ్యాయామాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం దాదాపుగా గంటన్నర పాటు తన కుటుంబ సభ్యులతో గడిపారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు, అభిమానులతో కలిసి జమ్మి చెట్టు వద్దకు ఊరేగింపుగా కాలినడకన వెళ్లారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, తన మనవడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోకి తిరిగి చేరుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. 


Similar News