యువకులను చితకబాదిన ఏఎస్ఐ
అకారణంగా నలుగురు యువకులను ఏఎస్ఐ చితకబాదిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై దసరా వేడుకల్లో చోటు చేసుకుంది.
దిశ,నాగర్ కర్నూల్ : అకారణంగా నలుగురు యువకులను ఏఎస్ఐ చితకబాదిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై దసరా వేడుకల్లో చోటు చేసుకుంది. బాధిత యువకులు తెలిపిన వివరాలు ప్రకారం...దసరా పండగ వేడుకల సందర్భంగా రాత్రి 11గం.లకు ట్యాంక్ బండ్ పైకి జమ్మి ఆకు కోసం వెళ్ళాము. జమ్మి ఆకు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో..నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఏఎస్ఐ నిరంజన్ రెడ్డి,విధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ మా నలుగురిని అకారణంగా కొట్టారు. ఎందుకు కొడుతున్నారు సార్.. అని అడిగితే మీది ఏ ఊరు, ఏ కులం అడగగా - బాధితులు మాది గన్యాగుల గ్రామం, మేము మాదిగ కులస్తూలమని చెప్పామన్నారు. అక్కడే ఉన్న ASI నిరంజన్ రెడ్డి బూతులతో కట్టెలు విరిగే వరకూ తనని చితక బాధినట్లు తెలిపారు. ఆదివారం గన్యాగుల గ్రామానికి చెందిన నాగరాజు, మహేష్, శివ, హరికృష్ణ లు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో తమని కొట్టిన ASI, కానిస్టేబుల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైట్ చేశారు.