అలంపుర్‌ను మరో యాదాద్రిగా తీర్చి దిద్దుతాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Update: 2022-01-16 15:18 GMT

దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అలంపూర్ జోగులాంబ పుణ్య క్షేత్రాన్ని మరో యాదాద్రి గా తీర్చిదిద్దుతామని తెలంగాణా టూరిజం శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ మినిష్టర్ క్వార్టర్స్‌లో జోగుళాంబ ఆలయ ఈ ఓ పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మలు మంత్రిని కలిశారు. జోగులాంబ ఆలయ ఈఓ గా బాధ్యతలు తీసుకున్న పురేందర్ కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారన్నారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జోగులాంబ క్షేత్రంలో పర్యాటకులను ఆకర్శించే థీమ్ పార్క్ వసతులు, అధునాతన రహదారులు, నది పై వేలాడే వంతెన, సేదతీరేందుకు అధునాతన వతీ సౌకర్యాలకు మొదటి విడతగా రూ.36 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు. టూరిజం అథితీ గృహంలో పర్యాటకులు క్షుద్భాద తీర్చేందుకు హోటల్‌ను కూడా మళ్లీ అందుబాటులో కి తెస్తామాన్నారు. ఆలయ ఈ ఓ, అర్చకులు, సిబ్బంది, స్థానికుల పరస్పర సహకారాన్ని తీసుకొని క్షేత్రాభివృద్దికి పాటుపడాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈఓ పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

Tags:    

Similar News