అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి - ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో ఈనెల 26న నిర్వహించే అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రైతులను, ప్రజలను కోరారు.
దిశ, అచ్చంపేట : జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో ఈనెల 26న నిర్వహించే అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రైతులను, ప్రజలను కోరారు. శనివారం సాయంత్రం పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఎమ్మెల్యే నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు లక్ష మందితో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తాం అన్నారు. అన్ని రంగాలకు నిలయంగా అచ్చంపేట ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మా వినయం, విధేయతనే మా గెలుపుకు దోహదపడుతుందని తెలిపారు. ః
2018 అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ తండాలో నాపై దాడి జరిగిందని అయిన ధీటుగా ఎదుర్కొని 10వేల మెజారిటీతో గెలుపొందానని పేర్కొన్నారు. ఈసారి కూడా 50 వేల మెజారిటీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం పరిచారు. అచ్చంపేట ప్రాంతానికి కావాల్సిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సభా వేదిక వద్దకు సీఎం దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారం చూస్తుంటే కారు జోరుగా ఉన్నట్లు స్పష్టం అవుతుందని తెలిపారు. మంచి చేయాలని మేము ప్రజల్లోకి వెళ్తే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
నా పార్టీ శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రతిపక్షాలు చేసే ప్రచారం అంతా ప్రజలను రెచ్చగొట్టేందుకే చేస్తున్నాయని వారిని తిప్పి కొట్టాలని సూచించారు. ఇంట్లో కూర్చుని నోట్లు లెక్కబెడుతూ ఓటర్లను కొనుగోలు చేద్దామని చూస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, బల్మూర్ ఎంపీపీ శ్రీమతి వేనేపల్లి అరుణ, నాయకులు అమీనోద్దిన్, లోక్యానాయక్, లాలుయాదవ్, వరుణ్, నారాయణ, ప్రతాప్ రెడ్డి, తిరుపతి యాదవ్, రేవళ్లి ఉస్సెన్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.