భారీగా చార్జీలు వసూలు చేసిన లేడీ కండక్టర్

పెంట్లవెల్లి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వెళుతున్న.. ఆర్టీసీ బస్సులో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Update: 2024-10-23 12:33 GMT

దిశ, పెంట్లవెల్లి: పెంట్లవెల్లి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వెళుతున్న.. ఆర్టీసీ బస్సులో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీపనగండ్ల, పెబ్బేరు బస్సు ప్రతిరోజు పెంట్లవెల్లి నుంచి కొండూరు మీద నుంచి 20 రూపాయలు చార్జి కాగా.. సోమవారం రెగ్యులర్ గా వచ్చే బస్సు టెక్నికల్ సమస్య ఉండడంతో.. ఆర్టీసీ డిఎం వేరే బస్సును పంపించారు. ఆ బస్సులో ప్రయాణికుల నుంచి కండక్టర్ పది రూపాయలు ఎక్కువ చార్జీలు వసూలు చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఆటో కి వెళ్లిన.. బస్సులోకి వెళ్లిన 20 రూపాయలు తీసుకునేవారని కానీ..ఈరోజు పది రూపాయలు ఎక్కువ వసూలు చేయడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ చార్జీలు వసూలు చేసిన కండక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Similar News