మరమ్మత్తులకు నోచుకోని కరెంట్ స్తంభం

స్తంభం విరిగి మూడు రోజులు గడుస్తున్న అధికారులు పట్టించుకోని ఘటన సమిస్తాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-13 14:56 GMT

దిశ, ఊట్కూర్ : స్తంభం విరిగి మూడు రోజులు గడుస్తున్న అధికారులు పట్టించుకోని ఘటన సమిస్తాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రధాన రహదారిపై మూడు రోజుల క్రితం ఒక ప్రైవేటు వాహనం స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం ఒక్కసారిగా వోరిగి ఉండిపోయింది. దీంతో గ్రామస్తులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో స్తంభానికి ఉన్న తీగలు సెలవులలో ఇంటికి వచ్చిన చిన్నారులు, ప్రజలపై పడుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. వాహనానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో..అక్కడి నుంచి డ్రైవర్ వాహనం తీసుకొని జారుకున్నాడు. సమస్య గురించి గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించిన పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. గ్రామంలో ఎటువంటి ప్రమాదాలు జరగకముందే కొత్త స్తంభాన్ని నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News