మాంస ప్రియులకు చేదు అనుభవం

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మటన్ మార్కెట్ లో మాంస ప్రియులకు చేదు అనుభవం ఎదురైంది.

Update: 2024-10-13 15:02 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా కేంద్రంలోని మటన్ మార్కెట్ లో మాంస ప్రియులకు చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో.. వయసు నిండని...రోగాలతో కూడిన మేకలను గొర్రెల మాంసం విక్రయించినట్లు మాంస ప్రియులు పేర్కొన్నారు. వయసు నిండని చిన్న మేక పిల్లలను..గొర్రెల మాంసం విక్రయించడం ఏమిటని ప్రశ్నించారు. దుర్వాసన వస్తున్న కుళ్ళిన మాంసం ఫ్రిజ్ లో పెట్టి విక్రయిస్తుండడంతో.. పరిశీలించిన మాంసం ప్రియులు విషయాన్ని గుర్తించారు. మటన్ మార్కెట్ లో మాంసం విక్రయ దారులతో గొడవకు దిగారు. మున్సిపల్ సంబంధిత అధికారులకు సమాచారం అందించిన ఎవరు రాకపోవడంతో పరిస్థితి కి పరిష్కారం లభించలేదు. వాస్తవానికి మున్సిపల్ అధికారులు ధ్రువీకరించిన ఆరోగ్యకరమైన గొర్రెలను మేకలను మాత్రమే వధించి విక్రయించాల్సి ఉంది. కానీ పేట మటన్ మార్కెట్లో ఇవేమీ నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


Similar News