108 వాహనంలో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం..
108 అంబులెన్స్ లో గిరిజన గర్భిణి పండంటి మగ బిడ్డ జన్మనిచ్చిన ఘటన గురువారం జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది.
దిశ, జడ్చర్ల: 108 అంబులెన్స్ లో గిరిజన గర్భిణి పండంటి మగ బిడ్డ జన్మనిచ్చిన ఘటన గురువారం జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామ శివారులోని మక్తపల్లి తండాకు చెందిన మూడవ రాజేశ్వరి (20)కి నెలలు నిండాయి. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వచ్చాయి. ,అందుబాటులో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో గర్భిణీ కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. దీంతో మిడ్జిల్ మండలంలో ఉన్న 108 వాహనం మక్తపల్లి తండాలో గర్భిణీ ఇంటికి 108 వాహనంతో చేరుకున్న సిబ్బంది గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గం మద్యలో పురిటి నొప్పులు అధికంగా అయ్యాయి.
దీంతో మార్గం మధ్యలో అంబులెన్స్ ఆపి అంబులెన్స్ పైలెట్ చెన్నకేశవులు ఇఏంటి రాజేందర్ గర్భిణీ కుటుంబ సభ్యుల సహకారంతో అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేశారు. దీంతో గర్భిణీ రాజేశ్వరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మార్గం మధ్యలో ఉన్న గంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లి బిడ్డను చేర్పించారు. అక్కడి వైద్యులు తల్లి బిడ్డను పరీక్షించి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సమయస్ఫూర్తితో గర్భిణీకి నార్మల్ డెలివరీ చేసిన 108 ఈఎంటి రాజేందర్ ను పైలట్ చెన్నకేశవులను గర్భిణీ కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది అభినందించారు.