లండన్ తరహాలో స్ట్రీట్ మ్యాప్స్.. కేటీఆర్‌కు నెటిజన్ అదిరిపోయే అడ్వైజ్

హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు.

Update: 2023-05-27 11:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. చారిత్రక కట్టడాలతో పాటు నగరంలోని నూతన నిర్మాణాలు కూడా ప్రస్తుతం చరిత్ర సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో పర్యాటకులు టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్లాలంటే పెద్ద టాస్కే అని చెప్పాలి. వాటిని వెళ్లి చూడాలంటే ఎక్కడ ఉంటుందో తెలిస్తే సరిపోదు కదా. ఎలా వెళ్లాలి. ఎంత దూరం. ఎటు నుంచి ఎటు వెళ్లాలి. ఎక్కడి నుంచి వెళితే తొందరగా రీచ్ అవుతాం అనే కన్ఫ్యూజన్ టూరిస్ట్‌లకు చికాకు తెప్పిస్తుంది.

అయితే, దీనిని సులభతరం చేయాలని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు అదిరిపోయే సలహా ఇచ్చాడు. లండన్ సిటీలో ఉండే స్ట్రీట్ మ్యాప్స్ మాదిరిగా హైదరాబాద్, వరంగల్, వంటి టూరిస్ట్ డెస్టినేషన్లలో ఏర్పాటు చేయాలని ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశాడు. పాపులర్ ఫుడ్, షాపింగ్ ప్లేసేస్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వంటి వివిధ సమాచారాలు ఉండే స్ట్రీట్ మ్యాప్స్‌ను ఏర్పాటు చేయాలని... దీని వల్ల వెళ్లే పని సులభంగా అవుతుందని కోరగా..మంత్రి కేటీఆర్ స్పందించారు. దీనిని వెంటనే నగరంలో అమలు చేయాలని ఐఏఎస్ అర్వింద్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి సూచించారు. దీంతో, త్వరలో నగరంలో స్ట్రీట్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News