Liquor Scam : వచ్చే వారంలోగా కవితకు బెయిల్ రావొచ్చు : KTR

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్ట్ ఈ రోజు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-08-09 10:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్ట్ ఈ రోజు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. గత కొన్ని నెలలుగా ఆమె జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కవితను జైలు నుండి బయటకి తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు మొన్నటి వరకు ఢిల్లీలో తెగ ప్రయత్నాలు చేశారు. ఈ మధ్యే తీహార్ జైలులో ఉన్న కవితను కలిశారు.

కవితతో భేటీ విషయంపై కేటీఆర్ ఈ రోజు తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడూతూ.. 'కవితకు వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశముందని, జైలులో కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారని, కవిత ఇప్పటి వరకు 11 కిలోల బరువు తగ్గిందని' వెల్లడించారు. అలాగే బీపీతో బాధపడుతుందని, జైలు పరిశుభ్రంగా లేదని, 11 వేలమంది ఖైదీలు ఉండాల్సిన జైలులో 30 వేలమంది ఖైదీల వరకు ఉన్నారని' మీడియాతో తెలిపారు. ప్రజలకోసం కొట్లాడేవారిపైన ఇటువంటి కేసులు తప్పవని, బెయిల్ కోసం మరోసారి అప్పీల్ చేశామని తెలిపారు. ఈ కేసులో మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చినందున కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశముందని కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో తెలిపారు.    


Similar News