ఎస్పీడీసీఎల్ లో పీక్ విద్యుత్ డిమాండ్

దక్షిణ డిస్కంలో రికార్డు స్థాయిలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-09-21 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ డిస్కంలో రికార్డు స్థాయిలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10:35 నిమిషాలకు 9,910 మెగా వాట్ల పీక్ విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈ సీజన్లో భారీగా వర్షాలు పడటం, నీటి లభ్యత పెరగడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండటంతో వ్యవసాయ రంగంలో డిమాండ్ భారీగా పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సీజన్ లో అత్యధిక డిమాండ్ 10,000 మెగావాట్లను కూడా దాటే అవకాశం ఉందని, డిమాండ్ ఎంత పెరిగినా దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా అందిస్తామని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 20న ఉదయం 10 గంటలకు 9,862 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి డిమాండ్ భారీగా పెరగడంతో ఈ వారంలో సరాసరి విద్యుత్ డిమాండ్ 9,317 మెగావాట్లు ఉండగా గతేడాది 9138 మెగావాట్లుగా ఉంది. సరాసరి వినియోగం 190.29 మిలియన్ యూనిట్లు కాగా, గతేడాది 182.11 మిలియన్ యూనిట్లుగా నమోదైనట్లు సీఎండీ వివరించారు.


Similar News