సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం.. పోలీసుల అదుపులో నలుగురు

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసి ఇరువర్గాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేసిన నలుగురిని షాహీ నాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

Update: 2024-09-21 17:33 GMT

దిశ, కార్వాన్: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసి ఇరువర్గాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేసిన నలుగురిని షాహీ నాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘మీలాద్ ఉన్న బీ’ పండుగా సందర్భంగా గోషామహల్ నియోజకవర్గంలో హిందువుల ఇళ్లలపై 500 మంది ముస్లిమ్‌లు దాడి చేస్తున్నారని తప్పుడు సమాచారాన్ని తమ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన లింకును పలు వాట్సప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేశారు. దీంతో శాంతి భద్రతలను భగ్నం చేసే విధంగా ఇరువర్గాల మధ్య గొడవపెట్టడానికి ప్రయత్నించారని, 9 భారత్ సమాచార్ అనే ఓ హిందీ ఛానల్ చైర్మన్ మహేష్ ఉపాధ్యాయ( 51)తో పాటు నరేష్ వ్యాస్(43) కెమెరామెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితోపాటు చార్మినార్ వద్ద లాఠీ ఛార్జ్ అవుతుందని సిన్ న్యూస్ ఛానెల్‌లో పోస్టు చేసి అసత్య ప్రసారం చేసిన షేక్ శౌకత్ అహ్మద్( 39)తో పాటు, దాన్ని ఫార్వర్డ్ చేసిన సందీప్ బొహరా(55) వ్యాపారిని కుడా అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ఎవరు నమ్మొద్దని, ప్రజల్లో ధ్వేషభావాన్ని పెంచి గొడవ పెట్టే విధంగా వీడియోలు షేర్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచించారు.


Similar News