Kunamneni: తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరం: ఎమ్మెల్యే కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం చాలా అవసరమని.. ఆ పార్టీ ఎప్పటికీ జీవించి ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-18 16:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం చాలా అవసరమని.. ఆ పార్టీ ఎప్పటికీ జీవించి ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్‌ పార్టీని కాపాడేందుకు కేసీఆర్ కృషి చేయాలని పేర్కొన్నారు. తాము కాంగ్రెస్‌తో మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు తమ మద్దతు ఉండబోదని అన్నారు. ఏళ్లు గడిచినా తమ ఉద్యమాలు, పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలను సీఎం రేవంత్ రెడ్డి సమన్వయం చేసుకుని పరిపాలన సాగించాలని చూచించారు. దేశ ప్రధానికి దేశ రాజ్యాగం మీద ఏ మాత్రం గౌరవం లేదని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాదని అన్నారు. బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధాంతాలను విస్మిరించిందని ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. 

Similar News