కిషన్ రెడ్డి తెలంగాణకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గనుల వేలం: దేవీప్రసాద్

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు

Update: 2024-06-26 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవీప్రసాద్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు తప్పా.. ప్రజలకు సంబంధించి ఏ యొక్క సంక్షేమం అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒకవైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ది చేసి చూపించిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏడు నెలల్లోనే 28 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని, రుణమాఫీ ఎవరికి చేస్తారు..? ఎవరికి ఇవ్వరో ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదన్నారు.

రైతు భరోసాకి అర్హులు ఎవరో ప్రభుత్వం చెప్పడం లేదని, ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజిగా ఉండి పట్టించుకోకపోవడంతో అన్ని వర్గాలు రోడ్ల మీదకు వస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు బీఆర్ఎస్ అండగా ఉండి వారితో కలిసి ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదటి గిఫ్ట్‌గా బొగ్గు గనులను వేలం వేశాడు, రాబోయే రోజుల్లో ఇంకెన్ని వేలం వేస్తారో తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను వేలం వేస్తుంటే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రైవేటీకరణ వేలంలో పాల్గొంటున్నారని దుయ్యబట్టారు.

Similar News