BIG News: ఎట్టకేలకు అలక వీడిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. దీపాదాస్ మున్షీతో చర్చలు సఫలం

జగిత్యాలలో కాంగ్రెస్‌ పంచాయతీ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల వరకు చేరింది.

Update: 2024-06-26 16:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాలలొ కాంగ్రెస్‌ పంచాయతీ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల వరకు చేరింది. కనీస సమాచారం లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు, కేడర్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ జీవన్‌రెడ్డి ప్రకటించడం తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. దీంతో ఆయనను బుజ్జగించి పరిస్థితిని చక్కదిద్దేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు రంగంలోకి దిగినా జీవన్‌రెడ్డి అలకను వీడలేదు.

చివరికి విషయం ఏఐసీసీ చెవిలో పడటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు కేసీ వేణుగోపాల్‌ను జీవన్‌రెడ్డి‌ని ఢిల్లీకి పిలిపించి చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం వారిద్దరితో జీవన్‌రెడ్డి చర్చలు సఫలం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీనే తనకు ముఖ్యమని ఆ సమావేశంలో జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిస్థితుల బట్టి కొన్ని నిర్ణయాలు ఉంటాయని దీపాదాస్ సమావేశంలో ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తామని జీవన్‌రెడ్డికి దీపాదాస్ మున్షీ హామీ ఇచ్చారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్ష పదవి విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జీవన్‌రెడ్డిని కించపరడం తమ ఉద్దేశం కాదని, ఎమ్మెల్యే సంజయ్ చేరిక తాను అగౌరవంగా భావించారని దీపాదాస్ మున్షీ తెలిపారు.    

Similar News