పదేళ్లలో కాంగ్రెస్‌ను అంతం చేయాలని కుట్ర.. బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్ఎస్‌ పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు

Update: 2024-06-26 17:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌ పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ అంతం చేయాలని కుట్ర చేసిందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల చేరికల విషయంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని తీసుకుని శ్రీధర్ బాబు ఢిల్లీకి వెళ్లి హై కమాండ్‌తో భేటీ అయ్యారు.

Similar News