KTR: దాని గురించి ముందు మాట్లాడింది మేమే
డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని, అఖిలపక్ష సమావేశం నిర్వహణపైనా ప్రభుత్వానికి క్లారిటీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని, అఖిలపక్ష సమావేశం నిర్వహణపైనా ప్రభుత్వానికి క్లారిటీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై వారికే స్పష్టత లేదని పేర్కొన్నారు. దేశంలో అందరికంటే ముందు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి మాట్లాడింది తమ పార్టీ అని తెలిపారు. డీఎంకే పార్టీ కన్నా ముందే డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి జరగబోయే నష్టం గురించి జాతీయ వేదికలపై మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం పాటుపడిన దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ విధానం వలన నష్టం జరుగుతుందని చెప్తూ వస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని పేర్కొన్నారు. డీలిమిటేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఉన్న బాధ్యత ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 22న చెన్నైలో జరిగే డీఎంకే సమావేశానికి హాజరవుతామని స్పష్టం చేశారు.