TG Assembly: రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు.. శాఖల వారీగా కేటాయింపులు ఇవే!

2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.

Update: 2025-03-19 06:12 GMT
TG Assembly: రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు.. శాఖల వారీగా కేటాయింపులు ఇవే!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లని తెలిపారు. అందులో రెవెన్యూ మూలధనం రూ.2,26,982 కోట్లు ఉందని అన్నారు. మూలధన వ్యయం రూ.36,504 కోట్లుని పేర్కొన్నారు. గతేడాదిలో పోలిస్తే వృద్ధి రేటు 10.1 శాతంగా నమోదైందని అన్నారు. 2024-25లో స్థూల ఉత్పత్తి రూ.16,12,579 కోట్లని, తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లుగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రస్తావించారు.

శాఖల వారీగా కేటాయింపులు ఇలా..

వ్యవసాయ శాఖ - రూ.24,439 కోట్లు

పశు సంవర్థక శాఖ - రూ.1,674 కోట్లు

పౌర సరఫరాల శాఖ - రూ.5,734 కోట్లు

విద్యా శాఖ - రూ.23,108 కోట్లు

కార్మిక శాఖ- రూ.900 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ- రూ.31,605 కోట్లు

మహిళా శిశు సంక్షేమ శాఖ - రూ.2,862 కోట్లు

ఎస్సీ సంక్షేమం - రూ.40,232 కోట్లు

ఎస్టీ సంక్షేమం - రూ.17,169 కోట్లు

బీసీ సంక్షేమం - రూ.11,405 కోట్లు

చేనేత రంగం - రూ.371 కోట్లు

మైనారిటీ సంక్షేమం - రూ.3,591 కోట్లు

పరిశ్రమలు - రూ.3,527 కోట్లు

ఐటీ రంగం - రూ.774 కోట్లు

విద్యుత్ రంగం - రూ.21,221 కోట్లు

వైద్య, ఆరోగ్య శాఖ - రూ.12,393 కోట్లు

పురపాలక శాఖ - రూ.17,677 కోట్లు

నీటి పారుదల శాఖ - రూ.23,373 కోట్లు

రహదారులు, భవనాలు శాఖ - రూ.5,907 కోట్లు

పర్యాటక రంగం - రూ.775 కోట్లు

క్రీడా రంగం - రూ.465 కోట్లు

అటవీ, పర్యావరణం - రూ.1,023 కోట్లు

దేవాదాయ శాఖ - రూ.190 కోట్లు


Read More..

TG Assembly: ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు  

TG Main: కాషాయ దళంలో నయా జోష్.. కొత్త సారథిగా ఆ నేత పేరు ఫిక్స్!  

Tags:    

Similar News