TG Budget: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో ఊహించని విధంగా కేటాయింపులు
2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,04,965 కోట్లని తెలిపారు. అందులో రెవెన్యూ మూలధనం రూ.2,26,982 కోట్లు ఉందని అన్నారు. మూలధన వ్యయం రూ.36,504 కోట్లుని పేర్కొన్నారు. గతేడాదిలో పోలిస్తే వృద్ధి రేటు 10.1 శాతంగా నమోదైందని అన్నారు. 2024-25లో స్థూల ఉత్పత్తి రూ.16,12,579 కోట్లని, తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లుగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగ రేటును 22.9 శాతం నుంచి 18.1శాతానికి తగ్గించేందుకు, యువతకు ఉపాధి కల్పించమే లక్ష్యంగా ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది.
సిటీ శివారు ప్రాంతమైన ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా AI సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్‌కు ఏర్పాటు కూడా శ్రీకారం చుట్టబోతోంది. త్వరలోనే వివిధ నోటిఫికేషన్ల ద్వారా 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. ఐటీఐఎస్‌ను మోస్ట్ అడ్వన్డ్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరించనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. 6,000 కోట్లు కేటాయించారు. BFSI రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 38 కళాశాలల్లో అమలు చేయనున్నారు.
Read More..
TG Budget: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన