తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమ శాఖకు భారీగా కేటాయింపులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రోజు తమ మొట్టమొదటి వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.

Update: 2025-03-19 06:27 GMT
తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమ శాఖకు భారీగా కేటాయింపులు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రోజు తమ మొట్ట మొదటి వార్షిక బడ్జెట్ (The first annual budget)ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మొదట బడ్జెట్‌ను కేబినెట్ ముందుకు తీసుకురాగా.. మంత్రివర్గం ఆమోదం తర్వాత.. తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉన్నట్లు సూచించారు. అలాగే మూల వ్యయం రూ.36,504 కోట్లుగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఈ బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ శాఖకు భారీ మొత్తంలో కేటాయింపులు చేసింది. ముందు నుంచి తమ పార్టీ దళితుల కోసం పెద్దపీట వేస్తుందని చెప్పుకొచ్చిన అర్ధిక మంత్రి భట్టి విక్రమార్క తాజా బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమం: రూ 40,232 కోట్లు కేటాయించినట్లు సభలో చెప్పుకొచ్చారు.

బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా ఉన్నాయి..

* వ్యవసాయ శాఖ- రూ.24,439 కోట్లు

* పంచాయతీరాజ్ శాఖ- రూ.31,605 కోట్లు

* మహిళా శిశు సంక్షేమ శాఖ- రూ.2,862 కోట్లు

* కార్మిక శాఖ- రూ.900 కోట్లు

* చేనేత రంగానికి- రూ.371 కోట్లు

*విద్యాశాఖ- రూ.23,108కోట్లు

* ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు

* పశు సంవర్ధక శాఖ- రూ.1,674 కోట్లు

*పౌరసరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు

* ఎస్సీ సంక్షేమం: రూ 40,232 కోట్లు

* పరిశ్రమల శాఖ- రూ.3,527 కోట్లు

* బీసీ సంక్షేమం- 11,405 కోట్లు

*మైనార్టీ సంక్షేమ శాఖ- రూ.3,591 కోట్లు

*ఐటీ రంగం- రూ.774 కోట్లు


Similar News