అన్నింటిలో మహిళలకే తొలి ప్రాధాన్యత.. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

Update: 2025-03-19 06:41 GMT
అన్నింటిలో మహిళలకే తొలి ప్రాధాన్యత.. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా బుధవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Minister Malli Bhatti Vikramarka) 2025-26 వార్షిక బడ్జెట్ (Budget) ను ప్రవేశ పెట్టారు. తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉందని భట్టి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి జోడు గుర్రాలు అని, అధికార పీఠం హోదాగా భావించడం లేదని చెప్పారు. దశాబ్దకాలం పాలన వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, నిరాధార ఆరోపణలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో సవాళ్లను అధిగమించామని, అంబేద్కర్ సూచించిన నైతిక విలువలు పాటిస్తూ ప్రజాపాలన సాదీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నామని అన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఇక లోక్‌సభ ఎన్నికలతో అభివృద్ధి పనులకు విరామం ఏర్పడిందని, కేంద్ర పన్నుల పంపిణీలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా ఇవ్వాలని, కేంద్రం విధిస్తున్న సెస్సులు, అదనపు ఛార్జీల వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందని వివరించారు. రాష్ట్రాలకు ఇస్తున్న 41 శాతం పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని ఆర్థిక సంఘాన్ని కోరామని, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గుతున్న పన్నుల వాటాపై ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పారు.

అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమని, దేశాభివృద్ధికి దోహదం చేస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించేలా పన్నుల వాటా ఉండాలని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో మహిళకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొచ్చారు. మహలక్ష్మీ పథకం కింద బస్సులో ఉచిత ప్రయాణానికి రాష్ట్ర మహిళలకు రూ.5,005 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా రూ.433 కోట్లు ఆదా చేసుకుంటున్నారని అన్నారు. అంతేగాక ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరుపై మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఇక మహిళలకు ఉద్యోగ అవకాశాల్లో కూడా దేశంలోనే అత్యధిక శాతం మన రాష్ట్రమే అవకాశాలు కల్పిస్తున్నదని భట్టి వెల్లడించారు.  

Read More..

TG Budget: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన  

Tags:    

Similar News