ACB: నాలుగు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు.. స్పందించిన KTR

తనపై నమోదైన కేసులపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.

Update: 2024-12-19 11:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: తనపై నమోదైన కేసులపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. అసెంబ్లీలోనే ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌(Formula-E car racing) వ్యవహారంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. సమాధానం చెప్పడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని అభిప్రాయపడ్డారు. కుంభకోణం జరిగిందంటున్నారు. చర్చ పెడితే.. అన్నింటికీ అసెంబ్లీలోనే సమధానం చెబుతానని.. ఎక్కడికి పారిపోను అని అన్నారు.

ఇదిలా ఉండగా.. ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదైంది. కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి మంగళవారం లేఖ రాశారు. లేఖ రాసిన మరుసటి రోజే కేటీఆర్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా.. నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు కేటీఆర్‌కు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

Tags:    

Similar News