KTR: ‘మూసీ మే లూటో.. దిల్లీ మే బాంటో’ కాంగ్రెస్ నినాదం.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

‘మూసీ మే లూఠో.. ఢిల్లీ మే బాంటో’ కాంగ్రెస్ నినాదమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-01 06:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాంటో’ కాంగ్రెస్ నినాదమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన అంబర్‌పేట నియోజకవర్గం (Amberpet Constituency)లోని మూసీ రివర్ బెల్ట్‌ (Musi River Belt)లో ఉన్న గోల్నాక డివిజన్‌ పరిధిలోని తులసి రామ్‌నగర్‌లో పర్యటించి అక్కడున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ (Hyderabad)లో లక్షలాది మందికి ప్రభుత్వం నిద్ర లేకుండా చేస్తుందని ఆరోపించారు. ఎవరు ఎప్పుడొచ్చి ఇళ్లను కూల్చుతారో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఆవేదనలో ఉన్నారని తెలిపారు. ‘మూసీ మే లూటో.. దిల్లీ మే బాంటో‘ అన్నట్లుగా కాంగ్రెస్ నినాదం ఉందని ఎద్దేవా చేశారు.

గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌ (BRS)కు ఓట్లు వేసిన వారిపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పగబట్టారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బులతో సర్కార్ మూసీ ప్రక్షాళణ చేపడుతోందని అన్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంత వాసులను అడవిలోకి పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఇక నుంచి ఎవరింటికైనా.. బుల్డోజర్ వస్తే కంచెలు అడ్డుపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను కడతామని చెప్పిన ప్రభుత్వం.. ఏకంగా ఇళ్లనే కూల్చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. 


Similar News