CV Anand: ఇక డీజేలపై నిషేధం.. ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ నగర వ్యాప్తంగా శబ్ధ కాలుష్యం పెరిగిన నేపథ్యంలో నగరంలో డీజేలపై నిషేధం విధించారు.

Update: 2024-10-01 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా శబ్ధ కాలుష్యం పెరిగిన నేపథ్యంలో నగరంలో డీజేలపై నిషేధం విధించారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) ఉత్తర్వులు జారీ చేశారు. మతపరమైన ర్యాలీలు, జూలూస్‌లలో డీజేను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా వెల్లడించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇక నుంచి కేవలం పరిమిత స్థాయిలో మాత్రమే సౌండ్ సిస్టమ్‌ (Sound System)లను అనుమతిస్తామని తెలిపారు.

వివిధ కారక్రమాల సందర్భంగా సౌండ్ సిస్టమ్‌ను పేట్టేందుకు నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్ (Police Station) నుంచి విధిగా క్లియరెన్స్ తీసుకోవాలని ఉత్తర్వు్ల్లో పేర్కొన్నారు. మొత్తం నాలుగు జోన్ల పరిధిలో సౌండ్ సిస్టమ్‌ను ఉదయం 55 డెసిబెల్స్‌కు మించి సౌండ్‌ను వాడకూడదని తెలిపారు. అదేవిధంగా రాత్రి వేళల్లో జస సమూహం ఉన్న ప్రాంతాల్లో 45 డెసిబెల్స్‌కు నుంచి సౌండ్‌‌ను పెట్టరాదని పేర్కొన్నారు. మతపరమైన ర్యాలీల్లో క్రాకర్స్ కాల్చడం పూర్తిగా నిషేధం అని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు, బాణాసంచ వాడితే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని సీవీ ఆనంద్ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. 


Similar News