హైదరాబాద్‌కు రానున్న 50 దేశాల ప్రతినిధులు.. లోగో ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా-2025 సదస్సు(BioAsia-2025 conference) లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్(Minister Duddilla Sridhar) బాబు మంగళవారం సచివాలయంలో ఆవిష్కరించారు.

Update: 2024-10-01 10:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా-2025 సదస్సు(BioAsia-2025 conference) లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్(Minister Duddilla Sridhar) బాబు మంగళవారం సచివాలయంలో ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25-26 తేదీల్లో బయోఏషియా 22వ ఎడిషన్ నిర్వహించనున్నారు. నగరంలోని హైటెక్స్‌లో నిర్వహించే ఈ అంతర్జాతీయ సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సాంకేతిక రంగాల్లో వస్తున్న పరిణామాలను పునర్నిర్వచించే విధానాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు.

గ్లోబల్ హెల్త్ కేర్ రంగంలో నూతన ఆవిష్కరణల ద్వారా తెలంగాణా కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ఆకాంక్షించారు. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, మెడికల్ డివైసెస్, అడ్వాన్స్‌డ్ థెరప్యూటిక్స్ వంటి టెక్నాలజీలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయని తెలిపారు. కృత్రిమ మేథ, డేటా అనలిటిక్స్, ప్రెసిషన్ మెడిసిన్ వంటి ఆధునిక పరిజ్ఞానాల ద్వారా వస్తున్న అవకాశాలను రాష్ట్రం ఏవిధంగా అందిపుచ్చుకోవచ్చో నిపుణులు సూచిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బయోసైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఐటీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Similar News