Kaleshwaram : కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ గడువు ఫిబ్రవరి వరకు పొడిగింపు
కాళేశ్వరం(Kaleshwaram) ఎత్తిపోతల పథకం బ్యారేజిల్లో అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్(Judicial Commission)గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది(Term Extended).
దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం(Kaleshwaram) ఎత్తిపోతల పథకం బ్యారేజిల్లో అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్(Judicial Commission)గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది(Term Extended). ఈ నెల 31 వరకే కమిషన్‌కు గడువు ఉండటంతో మరో రెండు నెలల(Two months)పాటు అంటే ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇరిగేషన్, కాడ్ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయగా, ఏప్రిల్ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభించింది. తొలుత కమిషన్ కు 100రోజుల గడువు నిర్ధేశించారు. అనంతరం ప్రతి రెండు నెలలకు ఒకసారి పొడిగిస్తూ వస్తున్నారు. విచారణ కీలక దశకు చేరుకోగా..సాంకేతిక పరమైన విచారణను, ఆర్ధిక, ప్రభుత్వ విధి విధానాల పరమైన విచారణను కమిషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆర్థిక, ఇరిగేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులను కమిషన్ విచారించనుంది. మరో 15మంది కీలక అధికారులను విచారణకు పిలువనున్నారు.
ఇప్పటికే 100మందికి పైగా వివిధ స్థాయి అధికారులను, ఇంజనీర్లను, ఈఎన్సీలను కమిషన్ ఘోష్ విచారించారు. వివిధ పార్టీలు, సంస్థల ప్రతినిధులను కూడా విచారించింది. గత ప్రభుత్వంలో అధికారంలో కీలకంగా ఉన్న ఇద్దరిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని సమాచారం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, పంప్ హౌస్ ల నిర్మాణాలు, డిజైన్లు, నిధుల ఖర్చు వంటి వాటిల్లో జరిగిన అక్రమాలపై ఘోష్ కమిషన్ కీలక సమాచారంతో ఆధారాలను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కాగ్, ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా విచారణలో కీలకంగా ఉన్నాయి.