మా పిల్లలనూ ఐఏఎస్, ఐపీఎస్ లుగా తయారు చేయండి.. సీఎం రేవంత్ కు ఆదివాసీ ఎమ్మెల్యేలు స్పెషల్ రిక్వెస్ట్

ఆదివాసీ వర్గాలకు చెందిన విద్యార్ధులను ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS)లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కోరారు.

Update: 2024-12-21 17:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదివాసీ వర్గాలకు చెందిన విద్యార్ధులను ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS)లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కోరారు. గడిచిన 70 ఏళ్లలో తెలంగాణ కేడర్(Telangana Cadre)లో ఆదివాసీ వర్గాల నుంచి ఒక్క సివిల్ సర్వెంట్ కూడా ఎంపిక కాలేదన్నారు. కనీసం గ్రూప్-1 అధికారి కూడా సెలక్ట్ కాలేదన్నారు. దీంతో ఆదివాసీ వర్గాల కోసం హైదరాబాద్(HYD)లో ప్రత్యేకంగా సివిల్స్ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. 500 మంది ప్రిపేర్ అయ్యేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని రిక్వెస్ట్ చేశారు. అమ్మాయిలకు నాలుగు, అబ్బాయిలకు నాలుగు హాస్టళ్లు చొప్పున వేర్వేరుగా ఎస్టాబ్లిష్​ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆదివాసీ జిల్లాల్లో ఎక్స్ క్లూజీవ్ స్టడీ సర్కిళ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దీంతో పాటు జేఈఈ, నీట్ కోచింగ్ లకు ఆదివాసీలకు స్పెషల్ సెంటర్లు అవసరమని వివరించారు.అంతేగాక జాతీయ స్థాయి పరీక్షల్లో ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ లో ఎంపికైన విద్యార్ధులకు ఐటీడీఏ ల ద్వారా ఆర్ధిక సాయం అందించేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా రూ.10 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ ఇవ్వాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీడీఏల కొత్త బిల్డింగ్, రెనోవేషన్ కు ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున కేటాయించాలని కోరారు. పోడు పట్టాలు పొందిన ఆదివాసీ ఉచిత విద్యుత్ సౌకర్యం అందజేయాలని కోరారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆదివాసీ లోకల్ లాంగ్వేజ్, మాతృబాషలో విద్యాను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిలో భాగంగా ఆయా బాషలపై పట్టున్న టీచర్లను కూడా రిక్రూట్ చేసుకోవాలన్నారు. ఈ మేరకు మంత్రి సీతక్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, వెడ్మ బొజ్జు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్ కు ప్రత్యేక వినతి పత్రం అందజేశారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. వెంటనే సీఎం ముందు దీంతో ఎమ్మెల్యేలు జారే ఆదినారయణ, వెడ్మ బొజ్జులు అసెంబ్లీ మీడియాతో పాయింట్ లో మాట్లాడుతూ.. ఆదివాసీ సమస్యలపై ప్రత్యేకంగా స్పందించిన సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. 1950 నుంచి ఆదివాసీ వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోనే సిస్టంను వెంనే ప్రక్షాళన చేసి సమస్యలకు చెక్ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ చీఫ్​మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, ప్రోఫెసర్ అనురాధ, రిటైర్డ్ అధికారి గొంది వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.


Similar News