BJP MP: అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమల వెళ్లారు

తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2024-10-01 10:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌(Jagan) తిరుమల పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు? అని ప్రశ్నించారు. డిక్లరేషన్‌ ఇవ్వాల్సి వస్తుందనే తిరుమల వెళ్లలేదా? అని అడిగారు. బైబిల్ చదువుతా అని నీ మతం ఏంటో చెప్పావని అన్నారు. అబ్దుల్ కలాం(Abdul Kalam) సైతం డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్లారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

కాగా, ఇప్పటికే తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subrahmanya Swamy) వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సీఎంపై సీరియస్ అయింది. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారం అని, రెండో అభిప్రాయం తీసుకోకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారని ఆక్షేపించింది. కనీసం దేవుడ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న దానికి ఆధారాలు ఏంటి? అని సూటిగా ప్రశ్నించింది.


Similar News