తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు

అక్టోబర్ నెల వచ్చేసింది.. పండగలతో ప్రారంభమైన ఈ నెల విద్యార్థులకు ఎంజాయ్‌మెంట్ తీసుకొచ్చింది. దీంతో తెలంగాణలో(Telangana) దసరా సెలవులు కూడా వచ్చేశాయ్.

Update: 2024-10-01 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ నెల వచ్చేసింది.. పండగలతో ప్రారంభమైన ఈ నెల విద్యార్థులకు ఎంజాయ్‌మెంట్ తీసుకొచ్చింది. దీంతో తెలంగాణలో(Telangana) దసరా సెలవులు కూడా వచ్చేశాయ్. ఇక విద్యార్థులకు పండగే పండుగ. వివరాల్లోకి వెళితే.. బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీగా సెలవులు(Holidays) ప్రకటించింది. రేపటి (అక్టోబర్ 2) నుంచి అక్టోబర్ 14 వరకు విద్యార్థులకు(Students) దసరా సెలవులను నిర్ణయించింది. ఈ క్రమంలో మళ్లీ అక్టోబర్ 15న స్కూల్స్ రీ-ఓపెన్ కానున్నాయి.

ఈ క్రమంలో ఇవాళ (అక్టోబర్ 1వ తేదీ) పాఠశాలల్లో(Schools) బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. అయితే రేపు (అక్టోబర్ 2న) గాంధీ జయంతి సెలవు కాబట్టి.. ఎలాగో స్కూల్స్, కాలేజీలకు అధికారిక సెలవు ఉంటుంది. దీంతో విద్యార్థులకు ఇది కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. ఇక వరుస సెలవులు వచ్చాయి. దీంతో హైదరాబాద్, ఇతర పట్టణాల నుంచి సొంతూళ్లకు పిల్లలతో కలిసి పేరెంట్స్ పయనమవుతున్నారు. కాగా ప్రైవేటు యాజమాన్యాలు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


Similar News