రూ. 2.80కోట్ల గంజాయి దగ్ధం

మత్తు పదార్ధాల అక్రమ రవాణా..వినియోగాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది

Update: 2024-10-01 11:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : మత్తు పదార్ధాల అక్రమ రవాణా..వినియోగాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడి కక్కడ ముమ్మర తనిఖీలు చేస్తూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్ధాలను సీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో పట్టుబడిన 2.80కోట్ల గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు దగ్ధం చేశారు. జిల్లాలోని ఆరు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 72 కేసుల్లో పట్టుకున్న 1120 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం డిప్యూటీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి వంటి అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణపై గట్టి నిఘా పెట్టామని, నిరంతరం తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. 


Similar News