Chamala: అల్లు అర్జున్ కు కలెక్షన్ల మీదే ధ్యాస.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్(Allu Arjun) కు సినిమా కలెక్షన్ల(Movie Collections) మీద తప్ప, ప్రజలపై ధ్యాస లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు.

Update: 2024-12-22 05:46 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) కు సినిమా కలెక్షన్ల(Movie Collections) మీద తప్ప, ప్రజలపై ధ్యాస లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై స్పందించిన ఆయన.. పలు సంచలన వ్యాక్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మీరు మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా నష్టం జరగద్దనే ఉద్దేశంతోనే టికెట్ ధరలు పెంచినా కూడా ప్రభుత్వం ఒప్పుకుందని స్పష్టం చేశారు. ఆరోజు సంధ్య థియేటర్లో మీరు సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది అంతా గందరగోళంగా ఉంది ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదని, మీకు సినిమా కలెక్షన్ల మీద ధ్యాస ఉంది తప్ప, ప్రజలు ఏమైతుండ్రు బయట ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిన్న అసెంబ్లీ(Telangana Assembly)లో ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించే అలా మాట్లాడారని, దానిపై మీరు రియల్ హీరోగా మాట్లాడలేకుండా స్క్రిప్టు తీసుకొచ్చి చదివిన విధంగా ఉందని అన్నారు. అలాగే ప్రజలకు ఏం సంజాయిషీ ఇస్తారో మీకే క్లారిటీ లేదని, నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన తీరు అలా ఉందని తెలిపారు. ఒక సెలెబ్రెటీ అయ్యి ఉండి.. బాధ్యత యుతంగా ఉండాలి కానీ ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దని సూచించారు. ఇక ఇంత జరిగినా మీరు.. నా క్యారెక్టర్ ను దెబ్బతీశారు అనడం విడ్డూరంగా ఉందని చామల అన్నారు. 

Tags:    

Similar News