Congress: అల్లు అర్జున్ తీరులో కనీస పశ్చాత్తాపం లేదు.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
అల్లు అర్జున్(Allu Arjun) తీరులో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) తీరులో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) అన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ రేవతి కుటుంబంపై కనీస సానుభూతి చూపించకుండా.. అసెంబ్లీTelangana Assembly)లో సీఎం రేవంత్ మాటలను తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. ఆ రోజు తొక్కిసలాటలో మహిళతో పాటు బాబు కూడా చనిపోయారని అనుకొని పోలీసులు అల్లు అర్జున్‌కి చెప్పే ప్రయత్నం చేసిన వినలేదని, ఆఖరికి డీసీపీ(DCP) వచ్చి మీరు వెళ్లాల్సిందే అని చెప్పిన తర్వాత కూడా థియేటర్ బయట షో చేసుకుంటూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్నటి ప్రెస్ మీట్ లో ఆయన తీరు.. వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప, బాధిత కుటుంబం గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi) లేవనెత్తినందుకు సభా వేదికగా ఆన్ రికార్డ్ జరిగింది ఓ మానవీయ కోణంలో చూడాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పే ప్రయత్నం చేసినందుకు.. ఏదో జరిగిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు.. బాధితుల ప్రాణాలు మీ పేరు ప్రతిష్టల కంటే ఎక్కవా అని ప్రశ్నించారు. అంతేగాక నిన్న అల్లు అరవింద్(Allu Aravind) మాట్లాడుతూ తన కొడుకు మూడీగా ఉన్నాడని బాధ పడుతున్నాడని, కానీ, ఆస్పత్రిలో ఆ చిన్నారి ఉలుకుపలుకు లేకుండా ఉన్నాడు.. ఆ విషయం ఎందుకు ఆలోచించట్లేదని అన్నారు. జరిగిన సంఘటనకు చింతించాల్సింది పోయి రేవంత్ రెడ్డిని తప్పుబట్టే ప్రయత్నం చేయడం సబబు కాదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.