Sandhya Theater : సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ ఫ్యాన్స్ బిగ్ కౌంటర్ !
సంధ్య థియేటర్ (Sandhya Theater)తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయిన సమాచారానికి సంబంధించి హీరో అల్లు అర్జున్(Allu Arjun)పై వస్తున్న విమర్శలకు బన్నీ ఫ్యాన్స్(Bunny Fans) ఎక్స్ వేదికగా బిగ్ కౌంటర్(Big Counter)వేశారు.
దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ (Sandhya Theater)తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయిన సమాచారానికి సంబంధించి హీరో అల్లు అర్జున్(Allu Arjun)పై వస్తున్న విమర్శలకు బన్నీ ఫ్యాన్స్(Bunny Fans) ఎక్స్ వేదికగా బిగ్ కౌంటర్(Big Counter)వేశారు. సినిమా చూస్తున్నప్పుడే మధ్యలోనే అల్లు అర్జున్ కు ఓ మహిళ(మొగుడంపల్లి రేవతి 35) చనిపోయిందన్న సమాచారం చెప్పామని పోలీసులు ..ఆ విషయం తెలిసినా కూడా బన్నీ రోడ్ షోగా బయటకు వెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సైతం అదే విషయం చెప్పారు. అయితే దీనిపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో స్పందిస్తూ తనకు మరుసటి రోజునే మహిళ చనిపోయిన విషయం తెలిసిందని స్పష్టం చేశారు. మహిళ మృతి సమాచారంపై అల్లు అర్జున్ అబద్దాలు చెబుతున్నారంటూ మళ్లీ ప్రభుత్వం వైపు నుంచి విమర్శల దాడి మొదలైంది. దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ అభిమానులు చనిపోయిన రేవతి భర్త భాస్కర్ ఓ టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఆ టీవి చానల్ ఇంటర్వ్యూలో రేవతి భర్త భాస్కర్ మాట్లాడుతూ నా భార్యను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారని రాత్రి 1:30కి నా మిత్రులు చెప్పారని, పోలీసులు మాత్రం నాకు ఆమె చనిపోయిందన్న సమాచారాన్ని తెల్లవారుజాము 3గంటలకు చెప్పారని వెల్లడించాడు. అదే వీడియోను బన్నీ అభిమానులు వైరల్ చేస్తున్నారు. రేవతి భర్తకే 3గంటలకు తెలిస్తే అల్లు అర్జున్ కు 12గంటలకే ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పో అంటూ బన్నీ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్ నగర్ నివాసి మొగుడంపల్లి రేవతి (35) మృతి చెందగా, ఆమె 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు.