MLC Balmuri Venkat : తెలుగోని సత్తా చాటడమంటే ఇలా కాదు అల్లు అర్జున్ : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

తెలుగోని సత్తా చాటడమంటే ఇలా కాదని..సంధ్య థియేటర్(Sandhya Theatre)లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు సానుభూతి చూపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat) హీరో అల్లు అర్జున్(Allu Arjun)కు హితవు పలికారు.

Update: 2024-12-22 05:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగోని సత్తా చాటడమంటే ఇలా కాదని..సంధ్య థియేటర్(Sandhya Theatre)లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు సానుభూతి చూపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat) హీరో అల్లు అర్జున్(Allu Arjun)కు హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)సంధ్య థియేటర్ ఘటనలో ఒకరి ప్రాణాలు కోల్పోయిన దానిపై అసెంబ్లీలో ప్రస్తావించాక మీరు పశ్చాత్తాపంతో ప్రెస్‌మీట్‌ పెట్టారని అనుకున్నామని, అందుకు విరుద్దంగా మీరు మాట్లాడం సరికాదన్నారు. మీరు ఆ రోజు థియేటర్ నుంచి ఎలా వెళ్లారో ఎప్పుడు వెళ్లారో అన్ని వీడియోలు ఉన్నాయని, అయినప్పటికి మీరు ప్రెస్ మీట్ లో మనిషి చనిపోయిన విషయం తర్వాతి రోజుదాక తెలియదని అబద్దాలే చెప్పారన్నారు.

థియేటర్ లో ఎంత సేపు మీరు సినిమా చూశారు..కారు నుంచి అభివాదం చేస్తూ చేసిన రోడ్ షోకు సంబంధించి వీడియోలు క్లియర్ గా ఉన్నాయని గుర్తు చేశారు. రేవతి మృతి ఘటన తర్వాత రోజు కూడా మీరు మీ ఇంటి దగ్గర టపాసులు కాల్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెబుతూ ప్రజాప్రభుత్వం తప్పు ఎవరు చేసిన చర్యలు తప్పవని ప్రజలకు భరోసానిస్తూ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత.. మీరు ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇప్పటికైనా మీరు మీ వ్యాఖ్యలపై ఆత్మ విమర్శ చేసుకుని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News