KTR: తుగ్లక్ కు లేటెస్ట్ వర్షన్ సీఎం రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

తుగ్లక్ కు(Tughlaq) లేటెస్ట్ వర్షన్(Latest Version) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Woking President KTR) అన్నారు.

Update: 2024-12-22 04:51 GMT

దిశ, వెబ్ డెస్క్: తుగ్లక్ కు(Tughlaq) లేటెస్ట్ వర్షన్(Latest Version) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Woking President KTR) అన్నారు. నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల(Telangana Assembly Meetings) నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు యుద్ద వాతావరణాన్ని తలపించాయి. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్, రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా సంచలన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన.. “తుగ్లక్” గురించి మనం పుస్తకాలలో మాత్రమే చదివామని, ఆధునిక వెర్షన్(Modern Version) చూడాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే చాలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆయన విధ్వంసం, పరధ్యానం, పాథలాజికల్ అబద్ధాలు చెప్పడంలో నిపుణుడు అని కేటీఆర్ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. 

Tags:    

Similar News