Loan Apps:లోన్‌ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు కేంద్రం షాక్‌!

ప్రస్తుత కాలంలో యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌(Online betting) మోజులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

Update: 2024-12-22 08:25 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌(Online betting) మోజులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ డబ్బులు తీసుకొని చెల్లించడం లేదని వేధింపులు చేయడంతో.. వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీటికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేంద్రం లోన్ యాప్‌లు(Loan App), వడ్డీ వ్యాపారులకు(money lenders) షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించనున్నట్టు ప్రకటించింది. లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకు రానున్నది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించే విధంగా ముసాయిదాను రూపొందించింది.


Similar News