Arvind Kejriwal :మహిళలు, వృద్ధుల స్కీంలపై కేజ్రీవాల్ కీలక ప్రకటన

దిశ, నేషనల్ బ్యూరో : 18 ఏళ్లకు పైబడిన మహిళలకు ప్రతినెలా రూ.1,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించే ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ స్కీంపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు.

Update: 2024-12-22 11:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో : 18 ఏళ్లకు పైబడిన మహిళలకు ప్రతినెలా రూ.1,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించే ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ స్కీంపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. ఈ స్కీంకు సంబంధించిన దరఖాస్తులను సోమవారం నుంచి ఇంటింటికి వెళ్లి ఆప్ వలంటీర్లు స్వీకరిస్తారని వెల్లడించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ(Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో తాము మళ్లీ గెలిస్తే ఈ మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.2,100కు పెంచుతామని కేజ్రీవాల్ తెలిపారు.

ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవివరాలను ఆయన చెప్పారు. ఈ స్కీంకు అప్లై చేసేందుకుగానూ ఓటరు గుర్తింపు కార్డును చూపిస్తే సరిపోతుందన్నారు. 60 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత చికిత్సను అందించేందుకు ఉద్దేశించిన సంజీవని యోజనకు కూడా సోమవారం నుంచే ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను స్వీకరిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Tags:    

Similar News