Thummala : రేషన్ కార్డు లేని రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్

రైతుల కోసం బీజేపీ దీక్షలు చేయడం సిగ్గు చేటని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Update: 2024-10-01 09:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రైతుల కోసం బీజేపీ దీక్షలు చేయడం సిగ్గు చేటని, రైతులను రుణ విముక్తులను చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రైతు రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మూడు విడతల్లో రూ. 18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబంధు బకాయిలు రూ. 7,656 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతుబంధు, రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాదని తుమ్మల హర్షం వ్యక్తంచేశారు. తప్పకుండా తాము అనుకున్న రైతుల 42 లక్షల ఖాతాలకు రూ.31 వేల కోట్లు రైతు రుణమాఫీ వారి ఖాతాల్లో జమచేస్తామన్నారు. ప్రభుత్వం అదే పనిలో ఉందన్నారు. ఇప్పటి వరకు 22 లక్షల ఖాతాలకు వేశామన్నారు. మూడున్నర లక్షల మంది కుటుంబ నిర్ధారణ జరిగిందని, 4 లక్షల ఖాతాలకు నిర్ధారణ జరగాలని, అవి జరిగాక వారి ఖాతాల్లో కూడా రూ. 2 లక్షల రుణమాఫీ జరుగుతదన్నారు. త్వరలో మిగిలిన రేషన్ కార్డు లేని ఖాతాలో రైతులకు రుణమాఫీ చేస్తామని గుడ్‌న్యూస్ చెప్పారు, రెండు లక్షల పైన ఉన్న రుణలకు షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. రుణమాఫీ కాని వారు ఆందోళన చెందవద్దని, మొదట పంటలోపే రైతుల ఖాతాలో వేసే బాధ్యత మాదన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు అక్కసుతో ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నాయని అన్నారు. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి సహకరంచకపోగా విమర్శిస్తున్నారని అన్నారు. పదేళ్లు పాలించిన ప్రముఖులు కూడా రుణమాఫీని విమర్శిస్తున్నారని అన్నారు. పదేళ్లు కేంద్రంలో పాలించిన బీజేపీ కూడా కార్యక్రమాన్ని హర్షించడం లేదని రైతులు ఎప్పుడూ రుణగ్రస్తులుగా ఉండాలనేది మిగతా పార్టీల ఉద్దేశం అని విమర్శించారు. రైతుల ఇబ్బందులతో రాజకీయ లబ్ది పొందాలనేది మిగతా పార్టీ ఉద్దేశమన్నారు. దేశ రైతుల సమస్యల పట్ల బీజేపీ నేతలు ఢిల్లీలోని జంత్‌మంతర్‌లో దీక్ష చేపట్టాలని సవాల్ చేశారు.

రైతల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని తుమ్మల ప్రశ్నించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు ఊసే లేదన్నారు. బీజేపీ ఇచ్చిన మానిఫెస్టోలో 23 హామీలు ఉన్నాయన్నారు. ఏ ఒక్క హామీని కూడా బీజేపీ దేశంలో అమలు పర్చలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా తేలేకపోయారని, నిధులు ఇవ్వాలని అడిగే దమ్ము బీజేపీ నేతలకు లేదన్నారు. సుమారు రూ. 2,700 కోట్లు రాష్ట్రానికి రావాలని, కానీ రూ.1300 కోట్లు కేంద్ర ఇచ్చిందన్నారు. ఈ పథకాలకోసం జంతర్ మంతర్‌లో ధర్నాలు చేయాలని, వారు ఎంచుకున్న సమయం తప్పని, రుణమాఫీ మధ్యలో ఉండగానే వారు నిద్రలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా రుణమాఫీ పూర్తికాకముందే దీక్షలు చేస్తున్నారని అన్నారు.


Similar News