కేసీఆర్ శకం ముగిసింది.. ముసలోడు 75 ఏండ్లు ఉంటడు: ఎంపీ అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో 24 గంటల దీక్ష చేపట్టింది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగింది.

Update: 2024-10-01 09:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో 24 గంటల దీక్ష చేపట్టింది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగింది. ఈ క్రమంలోనే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్‌ల‌కు తెలంగాణ స్టేట్ ఇంఛార్జి అభయ్ పటేల్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ దీక్షలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. ఈ దీక్షపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వయసు మీద పడింది ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో ఆయనకు కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. మోడీ రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందే మోడీ అని అన్నారు. ప్రాంతీయ పంటలకు నాడు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదని, నేడు కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. దౌర్భాగ్యమైన ప్రభుత్వం కేసీఆర్ నడిపిండూ.. నేడు రేవంత్ నడుపుతున్నాడని విమర్శించారు. వారు చేసిన హామీలు పచ్చి మోసంగా మిగిలి పోయాయన్నారు. ఈ రైతుదీక్షలు ప్రతి జిల్లాకు తీసుకుపోతామన్నారు.

ఒక రోజు హైడ్రాను బంద్ పెట్టే రోజు వస్తుంది

హైడ్రాపై హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టిందని అన్నారు. హైకోర్టును కూడా కూల్చివేస్తారా? అంటూ అనేక మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. హైడ్రా బంద్ కావాలని, ఏదో ఒక రోజు హైడ్రాను బంద్ పెట్టే రోజు వస్తోందన్నారు. రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం బాగా తెలుసన్నారు. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. తుర్కొన్ని ముట్టుకోలేదు, కాంగ్రెసోళ్లవి ముట్టుకోలేదు, బడాబాబులను ముట్టుకోలేదు కేవలం గరీబోళ్ల ఇండ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నరని తీవ్ర ఆరోపణలు చేశారు.

కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో ఒక్క మీటర్ కెనాల్ నిర్మించలేదని, ఒక్క ఎకరాకు నీళ్ళు అందించలేదన్నారు. కాళేశ్వరంలో ఎత్తుడు పోయుడు తప్ప ఏమీ లేదన్నారు. తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని, కేసీఆర్ శకంముగిసిందని, ముసలోడికి 75 ఏళ్లు నిండినవి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటడో.. పోతాడు తెలియదన్నారు. కేసీఆర్ పోతే కేటీఆర్, కవితను చూసి ఎవరూ కూడా ఓట్లెయ్యవని విమర్శించారు. 


Similar News