పుష్ప లెవెల్ మైలేజ్ కోసం కేటీఆర్ అరెస్టుకు సిద్ధం అవుతున్నాడు: కాంగ్రెస్ ఎంపీ చామల
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో అరెస్టు(Arrest) అయ్యేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడని.. తాను అరెస్టు అయితే పుష్ప -3(Pushpa-3) లెవెల్‌లో మైలేజ్ వస్తుందని అనుకుంటున్నాడన్నాడు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వేధింపులతో అరెస్టయినప్పుడు ప్రజల సానుభూతి లభించిందని.. ఇదే తరహాలో తనకు పొలిటికల్ మైలేజ్ వస్తుందని కేటీఆర్ బావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అలాగే కేసీఆర్(KCR) ఇంట్లో ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతుందని.. ఈ క్రమంలోనే కవిత(Kavita) జైలుకు వెళ్ళి వచ్చిందని.. తను కూడా జైలుకు వెళ్లి వస్తే మైలేజ్ పెరుగుతుందని కేటీఆర్ డ్రామాలు చేస్తున్నాడంటూ.. ఢిల్లీలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.