ఎన్కౌంటర్లపై కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు

రెండు రోజుల తేడాతో జరిగిన రెండు భారీ ఎన్కౌంటర్లపై భద్రాచలం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు.

Update: 2024-09-05 12:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజుల తేడాతో జరిగిన రెండు భారీ ఎన్కౌంటర్లపై భద్రాచలం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తున్నాన్న కూనంనేని.. దేశంలో రాజ్యాంగ విరుద్ధ పాలన నడుస్తుందన్నారు. కొద్ది రోజుల క్రితం దేశంలో నక్సలైట్లను రూపుమాపుతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని, అందులో భాగంగానే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 150 మందికి పైగా ఎన్కౌంటర్లలో మృతిచెందడమే ఇందుకు నిదర్శనం అన్నారు. రెండు రోజుల క్రితమే 9 మందిని ఎనకౌంటర్ పేరుతో చంపేశారని, ఈరోజు మరో ఐదుగురిని చంపేశారని.. ఇది కేంద్ర బీజేపీ దుర్మార్గమైన చర్య అన్నారు. కేంద్ర కనుసన్నల్లోనే ఇవి జరుగుతున్నాయని, వెంటనే వీటిని ఆపాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసే అన్ని పనులు సత్ఫలితాలు ఇవ్వడం లేదని, అలాగే నక్సలైట్ల వలన కూడా కొన్నిసార్లు తప్పిదాలు జరగవచ్చునని, అంతమాత్రాన అన్యాయంగా వారి ప్రాణాలు ఎలా తీస్తారని కూనంనేని కేంద్రాన్ని ప్రశ్నించారు.


Similar News