బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనపై కిషన్ రెడ్డి క్లారిటీ

పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. గురువారం పార్టీ నాంపల్లి కార్యలయంలో మీడియాతో మాట్లాడారు.

Update: 2024-01-25 13:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. గురువారం పార్టీ నాంపల్లి కార్యలయంలో మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే వారం అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. లక్షమంది ఒవైసీలు వచ్చినా మోడీని ప్రధాని కాకుండా అడ్డుకోలేరని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ పార్టీలు ఒక్కటే అని సీరియస్ కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్‌లో పోటీ చేయడం కోసం కాదు.. అసదుద్దీన్‌ను ఓడించడం కోసమే పని చేయాలన్నారు. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని అన్నారు.

Tags:    

Similar News