MLC Kodandaram : కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం పోరాడుతాం

కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం (MLC Kodandaram) అన్నారు.

Update: 2024-10-25 14:12 GMT

దిశ, కొత్తగూడెం : కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం (MLC Kodandaram) అన్నారు. శుక్రవారం రుద్రంపూర్ లో కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మాట -ముచ్చట కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా సంఘం ఉపాధ్యక్షులు గూడెల్లి యాకయ్య ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా కాంట్రాక్ట్ కార్మికుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు రాసూరి శంకర్ (Rasuri Shankar)మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టు కార్మికుల వేతనాలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని అన్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డు, కేటీపీఎస్ కార్మికులకు ఆర్టిజన్ గా గుర్తించి జీతభత్యాలు పెంచారని, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేశారని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులతో 9 గంటలు డ్యూటీ చేయిస్తున్నారని, పండుగలకు, సింగరేణి సెలవు దినాలకు జీతం కట్టివ్వాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికుల కుటుంబ సభ్యులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించే విధంగా సింగరేణి చర్యలు చేపట్టాలని, తమకు సహకారం అందించాలని ఎమ్మెల్సీ కోదండరామ్ ని కోరారు.

    స్పందించిన ఆయన కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని, వారికి రావలసిన అన్ని సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకునేలా సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మడిపల్లి కరుణాకర్, ఏరియా ప్రధాన కార్యదర్శి సాదిక్, మల్లెల రామనాథం, వల్లాల భరత్, ఇన్​చార్జి నాగుల్ మీరా, డ్రైవర్ల ఇన్​చార్జి రవి, చిట్టి ప్రసాద్, లతా, షకీల్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News