దిశ ఎఫెక్ట్.. రూరల్ డీసీసీబీలో ‘ఉపేంద్రుని’ మాయ నిజమే..!

'రూరల్ డీసీసీబీలో దా'రుణా'లు ' అనే శీర్షికను సోమవారం దిశ దినపత్రిక ప్రచురించింది.

Update: 2024-10-21 16:24 GMT

దిశ, ఖమ్మం రూరల్ : 'రూరల్ డీసీసీబీలో దా'రుణా'లు ' అనే శీర్షికను సోమవారం దిశ దినపత్రిక ప్రచురించింది. దిశ కథనానికి స్పందించిన డీసీసీబీ అధికారులు కథనంలో వచ్చిన వార్త నిజమేనని డీసీసీబీ (జిల్లా సహకార బ్యాంక్) చైర్మన్ దిశకు తెలిపారు. డీసీసీబీ అధికారులు మేనేజర్ పని పట్టే పనిలో నిమగ్నమయ్యారు. సదరు మేనేజర్ అనేక అక్రమాలకు పాల్పడినట్లు తేలినట్లు తెలిసింది. సహజంగా ఒక వ్యక్తికి ఏదైనా బ్యాంకులో రుణం కావాలంటే వంద రకాల రూల్స్ చెబుతూ రోజుల తరబడి బ్యాంకుల చూట్టు తిప్పుకుంటారు.

ఒక వేళ రుణం ఇవ్వాలన్న షూరిటీ (కోల్టరల్) కింద ఎదైనా ప్రాపర్టీ మార్టిగేజీ చేయాల్సిందే. లేదా దానికి సమానమైన రుణమైన డిపాజిట్ చేయాలని కొన్ని బ్యాంక్ నిబంధనలు పెట్టాయి. ఇదంతా ఓకే అనుకుంటే లీగల్ ఒపీనియన్ కింద ప్రతి బ్యాంకుకి ఒక లాయర్ను ఏర్పాటు చేసి వారి నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తరువాతనే సంబంధిత బ్యాంక్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసిన తరువాత రుణం మంజూరు చేస్తారు. ముగిసిన తరువాతనే లోన్ ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. దీనిని వాయిదాల పద్దతిలో చేల్లించే విధంగా నిబంధనలు విధించి ముందుగానే సంతకాలు తీసుకుంటారు. కానీ ఎంత వడ్డించే వాడు మనవాడైతే మాత్రం నిబంధనలు ఉల్లంఘించి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి లేని భూమిని సైతం సృష్టించి కోట్ల రుపాయలను కొల్లగొట్టిన కథ రూరల్ డీసీసీబీ( జిల్లా సహకార బ్యాంక్) శాఖలో జరిగింది.

గత రెండు ఏళ్ళ క్రితం ఇక్కడ పనిచేసిన ఓ మేనేజర్ ఇష్టారీతిన నిబంధనలను గాలికొదిలేసి సుమారు 20 మందికి పైగా నకిలీ ధ్రువపత్రాలు పెట్టి వారి బంధువులకు, తెలిసిన వారికి రూ. 3 కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలర్ జిరాక్స్ పెట్టి ఎటువంటి రూల్స్ పాటించకుండా రుణాలు ఇచ్చి వారి నుంచి లక్షల రుపాయలు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఫేక్ కొటేషన్లు సైతం తయారు చేసి కోట్లు రూపాయలు కొల్లగొట్టినట్లు సమాచారం.

సదురు బ్యాంక్ మేనేజర్ బదిలీ అయిన తర్వాత రుణాలు చెల్లించకపోవడంతో తర్వాత వచ్చిన అధికారులు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో లోన్లో షూరిటీ పెట్టిన సర్వే నెంబర్లలో పరిశీలించి చూడగా అక్కడ అసలు భూమి లేదని తేలడంతో విచారణకు వెళ్లిన అధికారులు అవాక్కౌనైనట్లు తెలిసింది. 20 మంది రుణదారుల ఇచ్చిన ధ్రువపత్రాల ప్రకారం.. అధికారులు సంబంధిత ప్రాపర్టీ చెకింగ్ చేయబోగా అసలు ఫీల్డ్ లేదని అధికారులు నివేదిక సైతం ఇచ్చినట్లు తెలిసింది. గతంలో పనిచేసిన మేనేజర్ రూల్స్ను బ్రేక్ చేస్తూ రుణాలు ఇచ్చి వారి నుంచి లక్షల రుపాయలు తీసుకుని కోట్లు కూడగట్టినట్లు విమర్శలు సైతం ఉన్నాయి. నాబార్డులోన్లు సైతం ఇష్టం వచ్చిన వారికి ఇచ్చి వారి నుంచి పర్సంటేజీల ప్రకారం కమిషన్ తీసుకున్నట్లు తెలిసింది.

సొంత తమ్మునికి రూ. 10 లక్షల రుణం బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన అతను సొంత తమ్ముడికి ఎటువంటి షూరీటి లేకుండా రూ.10 లక్షల నకిలీ రుణం పై మంత్రి తుమ్మల సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. ఇదే శాఖలో నేలకొండపల్లి మండల పరిధిలో సొసైటీలో పనిచేస్తుకుంటు నకిలీ రుణం పొందడం పై అధికారులు సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.

రూరల్ డీసీసీబీ లో అక్రమాల పై ఆర్సీబీ కి విచారణకు ఆదేశించా: డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు. రూరల్ డీసీసీబీ లో లోన్ లలో అక్రమాలు జరిగినట్లు తెలిసింది. దీని పై ఆర్సీబీకి పంపారని, విచారణలో అవినీతి తేలితే వారి పై శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. సొంత తమ్ముడి రుణం పొందడం పై కూడా విచారణ జరిపి అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాం.


Similar News