ఛత్తీస్‌గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్కౌంటర్..

ఛత్తీస్ ఘడ్ కాంకేర్ జిల్లా, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన భామర గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోపరి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

Update: 2024-10-21 13:10 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లా, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన భామర గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోపరి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పులలో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా ఒక జవాన్ కి గాయాలు అయ్యాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.


Similar News