Viral Video : 12వ అంతస్తు నుంచి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఏమైందో తెలుసా?

ఏదైన సమస్య ఒచ్చిందటే ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేయలేక అనాలోచిత నిర్ణయాలతో కొంత మంది ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంటారు.

Update: 2024-10-21 14:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏదైన సమస్య ఒచ్చిందటే ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేయలేక అనాలోచిత నిర్ణయాలతో కొంత మంది ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నించాడు. చివరికి ఏమైందంటే? వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని సూపర్ టెక్ కేప్ టౌన్ సొసైటీలో నివసిస్తోన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి 12వ అంతస్తు బాల్కనీ నుంచి దూకేందుకు సిద్ధమయ్యాడు.

ఇది గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే అతనిని కాపాడేందుకు అపార్ట్మెంట్‌‌లోని ఒక వ్యక్తి వేగంగా 12వ అంతస్తుకు చేరుకుని యువకుడిని పట్టుకొని పైకి లాగాడు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకు రా ఇలాంటి పనులు చేయడం.. అమ్మ నాన్న గుర్తుకు రారు ఏంట్రా అని అతనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. అదేవిధంగా దూకే యువకుడిని రక్షించిన వ్యక్తికి నెటిజన్లు సెల్యూట్ చెబుతున్నారు.


Similar News