శీలం నాగిరెడ్డికి నివాళులర్పించిన ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి..

మండలంలోని రామానుజవరం మాజీ సర్పంచ్ శీలం కోటారెడ్డి తండ్రి నాగిరెడ్డి దశదినకర్మ సోమవారం గ్రామంలో నిర్వహించారు.

Update: 2024-10-21 16:29 GMT

దిశ, తల్లాడ : మండలంలోని రామానుజవరం మాజీ సర్పంచ్ శీలం కోటారెడ్డి తండ్రి నాగిరెడ్డి దశదినకర్మ సోమవారం గ్రామంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోటారెడ్డితో అరగంటకు పైగా మాట్లాడారు. ఎలా జరిగిందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, కొమ్మినేని వెంకటేశ్వరరావు కె.వి., దుండేటి కేశవరెడ్డి, తూము వెంకటనారాయణ, పాసంగులపాటి లక్ష్మీనారాయణ, గంగాదేవిపాడు సొసైటీ చైర్మన్ తూము వీరభద్ర రావు, అనుమోలు బుద్ధి సాగర్, షేక్ యాకుబ్ పాషా, స్థానిక నాయకులు ఉన్నారు.


Similar News