జీతం రామగుండం.. ఉద్యోగం మణుగూరు..

మణుగూరు మున్సిపాలిటీలో అకౌంటెంట్ జేవోగా ఉద్యోగం చేస్తూ రామగుండం

Update: 2025-03-18 13:48 GMT
జీతం రామగుండం.. ఉద్యోగం మణుగూరు..
  • whatsapp icon

దిశ,మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీలో అకౌంటెంట్ జేవోగా ఉద్యోగం చేస్తూ రామగుండం ప్రాంతంలో పనిచేస్తున్నట్లుగా జీతం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మూడు ఏండ్ల క్రితం మణుగూరు మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేరాడు. తర్వాత రామగుండం ఏ-గ్రేడ్ మున్సిపాలిటీ లో ఏవోగా ప్రమోషన్ వచ్చింది.వచ్చిన ప్రమోషన్ వద్దనుకొని డిప్యూటేషన్ మీద మరల మణుగూరు మున్సిపాలిటీలో పని చేయడం గమనార్హం.అయితే రామగుండం మున్సిపాలిటీ వాళ్లు మణుగూరు లో పనిచేసే ఏవో తమ కార్యాలయానికే కావాలని వెంటనే ఏవోను బదిలీ చేయాలని వరంగల్ సీడీఎంఏ కు లెటర్ పెట్టినట్లు కూడా తెలుస్తోంది.

వరంగల్ సీడీఎంఏ అధికారులు స్పందించి మణుగూరు మున్సిపాలిటీలో పనిచేసే ఏవోను రామగుండం బదిలీ చేయాలని ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దీంతో జేవో కొంతమంది అధికారులకు ముడుపులు ముట్టజెప్పి రామగుండం వెళ్లకుండా మణుగూరుకే డిప్యూటేషన్ పై పోస్టింగ్ తెచ్చుకోవడం సంచలనంగా మారింది.ఆర్డర్స్ వచ్చిన ఒక్క రోజులోనే జేఓ ముడుపులతో అధికారులను కప్పి పెట్టాడని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.ఏవోగా ప్రమోషన్ వచ్చిన రామగుండం ఎందుకు వెళ్లడం లేదని అందులో ఆంతర్యం ఏమిటని పలువురు అనుమానిస్తున్నారు.

మణుగూరు మున్సిపాలిటీలో పర్సంటేజ్ లకు అలవాటు పడి, ప్రభుత్వ నిధులను గోల్ మాల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ జేవోగా ఉంటున్నారని స్థానికులు,తోటి ఉద్యోగస్థులు ఆరోపిస్తున్నారు.జేఓకి రామగుండం కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చిన ఈ విషయాన్నీ మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ ఎందుకు దాచి పెట్టారని పలు అనుమానాలకు దారిస్తోంది.అంతేగాక మణుగూరులోనే డిప్టేషన్ పై పోస్టింగ్ తేవడంలో కమిషనర్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కమిషనర్ కు,జేవో మధ్య లక్షల రుపాయల డీలింగ్ ఉన్నందునే జేవోను రామగుండం పంపివ్వలేదని పలువురు చర్చించుకుంటున్నారు.వీరిపై ఎంక్వరి కమిషన్ వేయాలని స్థానికులు కోరుతున్నారు.

సస్పెండైన వారిని కాపాడుతున్న ఇద్దరు BRS నాయకులు,మరో వ్యాపార వేత్త...

మణుగూరు మున్సిపాలిటీలో పనిచేసే ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లను లోకల్ లో ఉన్న ఇద్దరు BRS నాయకులు, మరో స్థానిక బడా వ్యాపారవేత్త అన్ని విధాలుగా కాపాడుతున్నారని వినపడుతోంది.ఈ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు 10 సంవత్సరాలు మణుగూరులో పని చేయడానికి కారణం ఈ నాయకులేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.వరంగల్ సీడీఎంఏ కార్యాలయంలో కొందరు అధికారులతో లావాదేవీల లింకులు పెట్టుకోవడం వల్లే ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు బదిలీలు జరగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.ఒక దగ్గర సస్పెండై వచ్చి,10 సంవత్సరాలు ఒకే మున్సిపాలిటీ ఆఫీస్ లో పని చేసిన ఈ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల అధికారులను ఎందుకు బదిలీ చేయడం లేదని స్థానికులు,అటు నాయకులు, ఇటు ప్రముఖులు సీడీఎంఏ అధికారులను,రీజినల్ డైరెక్టర్ ని ప్రశ్నిస్తున్నారు.ఈ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు 10 సంవత్సరాలు ఒకే మున్సిపాలిటీ ఆఫీస్ లో పని చేయడం వలన ఆదాయ మార్గాలు తెలుసుకొని లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని స్థానిక ప్రజలు,నాయకులు ఆరోపిస్తున్నారు.

ఎంక్వయిరీ కి వస్తే నాటు కోడి తో విందు,నోట్లకట్టల బహుమతులు..?

కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని అధికారులు తెలుసుకొని ఎంక్వయిరీపై కార్యాలయంకు వస్తే ఆఫీస్ లో ఉండే కొందరు వ్యక్తులు అధికారులకు మంచి నాటుకోడితో విందు ఏర్పాటు చేసి,కొంతనగదును కూడా ముట్టజెప్పుతారని వినికిడి వినిపిస్తోంది.చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి,బదిలీలు చేయకుండా అధికారులను మచ్చిగా చేసుకోవడానికే కార్యాలయంలో ఉండే కొందరు వ్యక్తులు ఆ దిశగా పని చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా సీడీఎంఏ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి లాంగ్ పీరియడ్ పని చేసిన సీనియర్ అసిస్టెంట్లు అధికారులను,డిప్టేషన్ పై ఉన్న జేవోను వెంటనే బదిలీ చేయాలని స్థానిక ప్రజలు, నాయకులు కోరుతున్నారు. లేదంటే వరంగల్ సీడీఎంఏ కార్యాలయం,భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మున్సిపాలిటీ ప్రజలతో నిరసన వ్యక్తం చేస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు.


Similar News